Advertisementt

మూడు ఆఫర్లు: ఓటేసేదెవరికి

Thu 15th Apr 2021 11:10 AM
puri jagannadh,liger movie,p[uri next hero,pawan kalyan - bandla ganesh combo,mahesh - business man producer combo,balakrishna son mokshgna,mokshgna entry movie  మూడు ఆఫర్లు: ఓటేసేదెవరికి
Three offers: Final commitment? మూడు ఆఫర్లు: ఓటేసేదెవరికి
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - బండ్ల గణేష్ కాంబో మూవీకి పూరి జగన్నాధ్ పేరు డైరెక్టర్ గా వినిపిస్తుంది. బండ్ల గణేష్ తో పవన్ కళ్యాణ్ మూవీ పక్కా. అది పూరి తోనా మరెవరితోనా అనేది తేలడం లేదు. ఇక మరోపక్క మహేష్ బాబు హీరోగా ఆర్.ఆర్ వెంకట్ అంటే బిజినెస్ మ్యాన్ ప్రొడ్యూసర్ గా పూరి దర్శకత్వంలో ఓ మూవీ. బిజినెస్ మ్యాన్ నిర్మాత మహేష్ - పూరి కాంబో మూవీ సెట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ మూవీని బాలకృష్ణ పూరి జగన్నాధ్ తో చేయించాలనే పట్టుదలతో ఉన్నారు.

చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ని చిరుత మూవీ తో పూరి జగన్నాధ్ సిల్వర్ స్క్రీన్ కి లాంచ్ చేసినట్లుగా తన కొడుకుని పూరి చేతుల మీదుగా లాంచ్ చేయిద్దామని బాలయ్య ఫిక్స్ అయ్యారు. ఈ మూడు ఆఫర్స్ లో పూరి ఏ కాంబినేషన్ కి ఓటేస్తాడు. ముంబై లో లైగర్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి హైదరాబాద్ వచ్చి సారధి స్టూడియో లో లైగర్ కోసం సెట్ వేసుకుని షూటింగ్ చేసుకుంటున్న పూరి జగన్నాధ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు. ఎవరికీ ఓటేస్తాడు.

బండ్ల గణేష్ - పవన్ కాంబో మూవీకా? లేదంటే మహేష్ - బిజినెస్ మ్యాన్ నిర్మాత కాంబోకా? కాదు బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ని లాంచ్ చెయ్యడానికి మొగ్గు చూపుతాడా? అసలు పూరి లైగర్ తర్వాత ఈ మూడు ఆఫర్స్ లో దేనికి ఓటేస్తాడు అనేది అందరిలో ఇప్పడు సస్పెన్స్ గా మారింది.

Three offers: Final commitment?:

Who is Puri next hero after Liger?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ